స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ ఎందుకు రాయాలి?

ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో వివిధ రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు లక్షల సంఖ్యలో ఉంటారు. ఏళ్ల తరబడి శ్రద్ధగా సన్న ద్ధం అవుతూ, నోటిఫికేషన్స్ రాక కోసం ఎదురు చూసే అభ్యర్థులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఇక్కడ అభ్యర్థుల పొరపాటు లేకపోయినా తగిన నోటిఫికేషన్లు లేకపోవడం వల్ల విలువైన సమయం కోల్పోవడం తో పాటు, కొన్ని సార్లు కెరీర్ గందరగోళం లో పడిపోతుంది.
ఇలాంటి సమస్య తక్కువగా ఉండేలా చూసుకోవాలి అనుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఎగ్జామ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండడం, ఉన్న కొద్ది పోస్టులకు రిక్రూట్ మెంట్ ఆలస్యంగా జరగడం వలన నోటిఫికేషన్స్ రావడానికి సాధారణంగా కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రతీ సంవత్సరం మరియు ఎక్కువ సంఖ్యలో నోటిఫికేషన్స్ వెలువడే పరీక్షకి సన్నద్ధం అయితే గనక తక్కువ సమయంలో మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఎక్కువ వుంటుంది. 
అలా ప్రతి సంవత్సరం మరియు తగిన సంఖ్యలో ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్స్ వెలువడే పరీక్షలయిన UPSC, bANKING, SSC Exams రాయడం వలన తక్కువ సమయంలో ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది.

 
                                 https://www.youtube.com/watch?v=DrZTLwZqphM&t=41s
 
 
 

Post a Comment

0 Comments