కెరీర్ ని ఎంచుకోవడం ఎలా?

 కెరీర్ ని ఎంచుకోవడం ఎలా?

 యుక్త వయసులో ఉన్న ప్రతీ ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్న ఇది. అలాగే ముందున్న జీవితం సంతోషంగా సాగాలంటే ఎంతగానో అలోచించి, ఎన్నో విధాలుగా తర్కించుకుని నిర్ణయం తీసుకోవాల్సిన విషయం కూడా. 

ఇంత ముఖ్యమైన విషయం అయి ఉండి కూడా ఎదో తప్పదు కదా అనో లేక ఇంకెవరో చెప్పారు అనో తమ కెరీర్ ని ఎంచుకునేవారు ఈ రోజుల్లో కూడా లేకపోలేదు. 

అలాంటి తప్పు, పొరపాటు మీరు చేయకూడదు అంటే కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే.. 

1. మీకు బాగా నచ్చిన విషయాలని/ సబ్జక్ట్స్ లని నోట్ చేసుకోవాలి.

2. అలా రాయగా వచ్చిన విషయాల్లోనుంచి ఏవైతే నీ శక్తి మేరకు సంపాదించగలవో, దేనినైతే ఏమాత్రం కష్టం అనిపించకుండా ఇష్టంగా చేస్తావో అలాంటి కెరీర్ ల ని హైలైట్ చేసుకోవడం 

3. అందులో నుండి ఏ కెరీర్ కైతే మంచి మార్కెట్ ఉందొ అలాగే భవిష్యత్ లో కూడా మంచి మార్కెట్ ఉంటుంది అనే అంచనా వేసుకుని (తగిన రీసెర్చ్ చేసుకుని) అలాంటి కెరీర్ ని ఫైనలైజ్ చేసుకోవాలి. 

4. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవాలి కానీ నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. 

ఇక్కడ ముఖ్యంగా గమనించ వలసినది ఏమిటంటే, మీకు బాగా ఆసక్తి ఉన్న రంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ ఆ కెరీర్ లోకి వెళ్లడం సాధ్యం కాదు లేదా తగిన మార్కెట్ లేదు అని పూర్తి అవగాహన ఉంటేనే రెండవ ఆసక్తి కి వెళ్ళాలి. ఎందుకంటే మీ ఉద్యోగ జీవితంలో ఎంతగా సక్సెస్ పొందారు అన్నది మీరెంచుకున్న కెరీర్ పై మీకున్న ఇష్టం పైనే ఆధారపడి ఉంటుంది.

 కాబట్టి మీకు బాగా నచ్చిన విషయం/సబ్జెక్టు కి సంబంధించిన రంగం/కెరీర్ కి ప్రాధాన్యత ఇవ్వండి. అలా చేసినప్పుడు మీ కెరీర్ లో మీరు తప్పక విజయం సాధిస్తారు.

కెరీర్ ని ఎంచుకునే విషయంలో మీకు ఇంకా అవగాహన కావాలి అంటే ఈ క్రింది వీడియో చూడండి. 

       


Post a Comment

0 Comments